EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భూ భవన దాతకు ఘన సన్మానం

పశ్చిమ గోదావరి జిల్లా ఫిబ్రవరి 14 (ఈ బీ న్యూ స్);భూమిని దానం చేయడమే గొప్ప విషయమైతే, దానం చేసిన భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా చేసి, సమాజానికి అంకితం చేసారు నాగులకొండ గోపి సత్యనారాయణ, శాంతి రత్న గార్లును బుదవారం ఘనంగా సన్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చిత్తరువు గట్టులో శ్రీ సాయి గాయత్రి వి.బ్రా ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ సభలో ఇరువురు దంపతులకు ఘన సన్మానించారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అతిథిగా హాజరైన వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ, గోపి సత్యనారాయణ సత్యసాయి సేవా సమితి ద్వారా సమాజానికి బహు విధమైన సేవలు అందజేయడమే కాక, ఈరోజు తన స్వంత భూమి లో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి సమాజానికి అంకితం చేయడం వారి సేవా తత్పరత పరాకాష్ఠ అని అన్నారు. మొదటి అంతస్తు డైనింగ్ హాల్ నిర్మాణానికి అధిక మొత్తంలో విరాళం ఇచ్చిన ముదపాక శివ వరప్రసాద్/ముదపాక కేదార్ రూ.2,50,002/-, కొచ్చెర్ల కామేశ్వరరావు సోదరులు 1,75,000/-, నాగులకొండ జైజీనాథ స్వామి 1,11,123/-, బంగారు తాతారావు 1,01,116/-, నాగులకొండ చిన్న వీరభద్రం 1,01,116/-, నాగులకొండ లక్ష్మీనారాయణ 1,01,116/-, నాగులకొండ అశోక్ కుమార్ 1,00,116/-, బంగారు శ్రీనివాస్ 1,01,116/-, మొదలైన దాతలు అందరికీ వెస్సో ట్రస్ట్ తరఫున ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top