EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రైతుల పాలిట గుదిబండలా మారిన వ్యవసాయ శాఖ

రైతుల పాలిట జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వం, వ్యవసాయ శాఖ గుదిబండలా మారింది అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది ధ్వజమెత్తారు. సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్మోహన్ రెడ్ది ప్రభుత్వం 53 నెలల్లో రైతులకు ఖర్చు చేసినట్టు చెబుతున్న వేల కోట్లు బూటకం. 9 గంటల నాణ్యమైన కరెంట్ అవాస్తవం. షిర్డీసాయి, అదాని కంపెనీలకు దోచిపెట్టడం తప్ప చేసింది ఏమీ లేదు. కేంద్రం ఇచ్చే రైతు భరోసా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకుంది. రైతులకు ఖర్చు చేసింది రూ.36 వేల కోట్లు మాత్రమే.. అందులోనూ 16 శాతం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది. ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి మోసపూరిత యాడ్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం రైతులకు చేసిన సాయం ప్రకటన చూస్తుంటే నా మీద ఇతర దేశాల్లో కూడబెట్టినట్టుంది. 400 ఉన్న కరవు మండలాలను కేవలం 103 మాత్రమే ప్రకటించారు. కరవు మండలాల్లో పర్యటిస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే హృదయ విధారంగా ఉంది.. కన్నీరు వస్తుంది.’’ అని తెలిపారు.‘‘టీడీపీ హయాంలో విపత్తుల్లో రైతులను ఆదుకున్నాం. వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి నిజాయితీ ఉంటే.. వ్యవసాయంపై అబద్ధాలు కాకుండా నిజాలు బయట పెట్టాలి. బడ్జెట్లో ప్రవేశ పెట్టిన దాన్ని కూడా ఖర్చు పెట్టడం లేదు. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి రైతుల మధ్యలోకి వెళ్లాలి.’’ అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top