EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న వైసీపీకి కీలక నేతలు

అమరావతి, ఏప్రిల్ 5 (ఈతరం భారతం న్యూ స్);: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారపార్టీకి కొందరు నేతలు షాకిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో వైసీపీ నుంచీ తెలుగుదేశంలోకి భారీ చేరికలు జరిగాయి.లోకేష్ సమక్షంలో గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు చెందిన తాడిశెట్టి మురళీ దంపతులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తాడిశెట్టి మురళీ వందలాది కారులతో లోకేష్ ఇంటికి చేరుకున్నారు. అలాగే అనంతపురం వైసీపీ నేత జయరామ్ నాయుడు దంపతులతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top