EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వైసీపీ తప్పుడు ఓట్లను నమెదు చేస్తు , ఉన్న ఓట్లను తొలగిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

వైసీపీ తప్పుడు ఓట్లను నమెదు చేస్తు , ఉన్న ఓట్లను తొలగిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ లిస్ట్ చెక్కు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుంది. అన్ని వర్గాలను అణచివేసే ధోరణికి వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తప్పుడు విధానాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్‌రెడ్డి ఓడిపోవడం ఖాయం.. జైలుకెళ్లడం ఖాయం. పవన్ కళ్యాణ్ , లోకేష్, చంద్రబాబు బయటకు రాకూడదని జగన్ లేనిపోని నిబంధనలు పెడుతున్నాడు. జగన్మోహన్‌రెడ్డి బాబాయ్‌ వివేకా హత్య కేసును జగన్ మేనేజ్ చేస్తున్నారు. కోడికత్తి కేసు వాస్తవాలు బయటకు వస్తాయని అందుచేతనే సాక్ష్యం చెప్పకుండా జగన్ ప్రక్కదారి పట్టిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారు’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top