సర్పంచ్‌లకు నిధులు, విధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మోసం చేశారని సర్పంచ్‌ల సంఘం గౌరవ అధ్యక్షులు బాబూరాజేంద్రప్రసాద్ అన్నారు. ఏపీ సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు పంచాయతీ ఛాంబర్ కార్యాలయంలో శుక్రవారం నాడు సమావేశం అయ్యారు. జగన్మోహన్‌రెడ్డి నిధుల మళ్లింపుపై మరోసారి కేంద్రానికి ఫిర్యాదులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వందరోజుల కార్యాచరణతో వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సాగించేలా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా బాబూరాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ…‘‘గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఉద్యమించాం.14, 15 ఆర్ధి సంఘం నిధులు 8620కోట్ల రూపాయలను జగన్ దొంగిలించారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. కేంద్ర కమిటీ వచ్చి విచారణ చేసి నిర్ధారించారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల నిధులు వారికి ఇచ్చేయాలని ఆదేశించింది. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022, 23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన నిధులు 936 కోట్లు కూడా ఆగిపోయాయి. 23-24 ఆర్ధిక సంవత్సరం నిధులు 2031కోట్ల నిధులు కూడా ఆపేశారు. దీంతో గ్రామాలల్లో తాగునీరు అందించడానికి కూడా ఒక్క రూపాయి లేని దుస్థితి. గ్రామాలల్లో ప్రజలకు జవాబు చెప్పలేక.. సర్పంచ్‌లు అవమానాలు ఎదుర్కొంటున్నారు. రెండో దశ ఉద్యమాన్ని చేపట్టాలని ఈరోజు కార్యాచరణపై సమావేశం అయ్యాం. ఉద్యమాల ద్వారా మరోసారి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని బాబూరాజేంద్రప్రసాద్ తెలిపారు.