అంతరిక్షం నుంచే ఓటు వినియోగించుకోనున్న సునీతా విలియమ్స్
హైదరాబాద్:(ఈతరం భారతం)
బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమమ్స్, బుచ్ విల్మోర్ తాజాగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా లో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు. తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుం టామని చెప్పారు.
అమెరికా పౌరురాలిగా ఓటు హక్కు వినియోగిం చుకోవడం తన కీలక బాధ్యత అని చెప్పారు. బ్యాలెట్ పేపర్ల కోసం అభ్యర్థన పంపించామని పేర్కొన్నారు..















