EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని ముందుకు వెళ్తాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఇబ్బంది కలుగనీయం. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఈ బీ న్యూస్ );: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ రివ్యూ మీటింగ్ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… జీహెచ్‌ఎంసీలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వచ్చే సమ్మర్‌లో నీటి ఎద్ధడికి ఎలాంటి సమస్య లేదన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ముందుకు వెళ్ళబోతున్నామన్నారు. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు.

కేంద్రాన్ని కలుపుకుని వెళ్తాం…

అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి విబేధాలు లేవని… అభివృద్ధిలో కేంద్రాన్ని కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై రోజూ వారీగా సమీక్షలు ఉంటాయని… సమస్యలపై రిపోర్ట్ తయారీ ఉంటుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు అలెర్ట్‌గా ఉండాలని సూచన చేశామన్నారు. అప్పులు – ఆస్తులు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం తరహాలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. జీహెచ‌ఎంసీ సమస్యలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించామన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ త్రాగునీటి అంశంలో రాజకీయ అపోహలు మాత్రమే అని… ఎలాంటి సమస్యలు లేవన్నారు. వచ్చే సమ్మర్‌లో సిటీలో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓఎస్‌డీని నియమిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

 

Related News

Select the Topic
Scroll to Top