EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు హైదారాబాద్ వాసుల మృతి

హైదరాబాద్ సెప్టెంబర్ 4 (ఈతరం భారతం);అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు మరణించారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని అన్నాలోని రోడ్డు నంబర్‌ 75లో శుక్రవారం వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి అతి వేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు.మృతులను హైదరాబాద్‌కు చెందిన ఓరంపాటి ఆర్యన్‌ రఘునాథ్‌, ఫారూక్‌ షేక్‌, పాలచర్ల లోకేశ్‌‌, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌గా గుర్తించామని అక్కడి అధికారులు వెల్లడించారు. కాల్‌పూలింగ్‌ ద్వారా ఈ నలుగురు బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

Related News

Select the Topic
Scroll to Top