EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణంగా హత్య    ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి చంపిన వైనం

న్యూఢిల్లీ జనవరి 29 (ఈ బీ న్యూ స్);: భారతీయ విద్యార్థి అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు వచ్చే వరకు భారతీయ విద్యార్థి మృతదేహం వద్దనే ఉన్నాడు. అమెరికాలోని జార్జియాలో ఈ సంఘటన జరిగింది. భారత్‌కు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ అమెరికాలో మాస్టర్స్‌ కోర్సు చదువుతున్నాడు. లిథోనియాలోని ఒక స్టోర్‌లో క్లర్క్‌గా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇల్లు లేని జూలియన్ ఫాల్క్‌నర్ అనే వ్యక్తి ఆ స్టోర్‌లోకి వచ్చాడు. బయట చలిగా ఉండటంతో వివేక్‌తోపాటు ఆ స్టోర్‌ సిబ్బంది అతడికి ఆశ్రయం ఇచ్చారు. రెండు రోజులు అక్కడ ఉన్న ఫాల్క్‌నర్‌కు చిప్స్, కోక్, తాగునీటితోపాటు వెచ్చదనం కోసం జాకెట్ కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి వివేక్‌ను పలుమార్లు సిగరెట్లు అడిగి తీసుకున్నాడు. కాగా, జూలియన్ ఫాల్క్‌నర్ ఆ స్టోర్‌ నుంచి వెళ్లకుండా అక్కడే మకాం వేశాడు. ఈ నేపథ్యంలో జనవరి 16న స్టోర్‌ నుంచి వెళ్లాలని లేకపోతే పోలీసులకు ఫోన్‌ చేస్తానని వివేక్‌ అన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు అతడు సిద్ధమయ్యాడు. ఇంతలో జూలియన్ ఫాల్క్‌నర్ చేతిలోని సుత్తితో వివేక్‌ వద్దకు వచ్చి దాడి చేశాడు. అతడి తల, ముఖంపై సుమారు 50 సార్లు సుత్తితో కొట్టాడు. రక్తం మడుగుల్లో పడిన వివేక్‌ అక్కడికక్కడే చనిపోయాడు.మరోవైపు ఇది చూసి ఆ స్టోర్‌లోని మిగతా సిబ్బంది భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వివేక్‌ మృతదేహం వద్ద చేతిలో సుత్తితో ఉన్న జూలియన్ ఫాల్క్‌నర్‌ను అరెస్ట్‌ చేశారు. ఆ స్టోర్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top