EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్ ఫిబ్రవరి 17 (ఈ బీ న్యూ స్);సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నలభై ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అంతకుముందు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా బీఆర్ఎస్‌ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌ కార్యాలంయ ప్రతినిధి ద్వారా ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు. సీఎం కేసీఆర్‌ తరఫున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆ లేఖను, పుష్పగుచ్ఛాన్ని అందుకున్నారు.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top