EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇండియా వర్సెస్ యూ ఎ ఈ : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం!

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ నవంబర్ 24:

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 28 బంతుల్లోనే శతకం సాధించి వన్డే క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. 14 సిక్స్‌లు, 4 ఫోర్లతో 28 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న 15 ఏళ్ల వైభవ్.. ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రెజర్-మెక్‌గర్క్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను 15 ఏళ్ల వైభవ్ బద్దలు కొట్టాడు._

లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బ్యాటర్లలో వైభవ్ అగ్రస్థానంలో నిలవగా.. జేక్ ఫ్రెజర్-మెక్గర్క్(19 బంతులు), ఏబీ డివిలియర్స్(31), సాకిబుల్ గని బిహార్(32 బంతులు), ఇషాన్ కిషన్(33 బంతులు) ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. అతను వెస్టిండీస్‌పై 2015లో 31 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. భవిష్యత్తులో వైభవ్ ఈ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది._

16 బంతుల్లో 50.. 28 బంతుల్లో 100

ఈ టోర్నీలో గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం చూపించాడు. తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన వైభవ్.. రెండో ఓవర్‌లో మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. మూడో ఓవర్‌లో మరో మూడు సిక్స్‌లు బాది 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ(12) ఔటైనా.. వైభవ్ తన సిక్సర్ల మోత మోగించాడు. ప్రతీ ఓవర్‌లో సిక్స్‌లు బాదుతూ జట్టు స్కోర్‌ను పరుగెత్తించాడు.అతని ధాటికి భారత్ 5 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. ఇబ్రార్ అహ్మద్ వేసిన 7వ ఓవర్‌లో 6, 4, 4 బాది సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. అనంతరం 6, 6, 4 బాది ఒకే ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్నాడు. తన సెంచరీలో 90 పరుగులను సిక్సర్ల ద్వారానే రాబట్టాడు. 40 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను కూడా అందుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వైభవ్ ఇప్పటి వరకు 6 శతకాలు నమోదు చేయగా.. అన్నీ వేగవంతమైనవే కావడం గమనార్హం.

Related News

Select the Topic
Scroll to Top