హైదరాబాద్, జనవరి 25 (EB news);: తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఎంపీలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావు పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బావాబామ్మర్దులు ఇద్దరూ పార్లమెంట్లో అడుగు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ అని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని కేటీఆర్ కొట్టిపారేశారు. తమకైతే ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో గత కొద్దిరోజులుగా కేటీఆర్, హరీష్రావులపై వస్తున్న వార్తలకు తెరపడినట్లైంది.
కేసీఆర్ సంగతేంటో..?
కాగా.. కేటీఆర్ మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి.. హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. కేసీఆర్ కూడా పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగింది. అయితే.. హరీష్ రావు, తాను పోటీ చేయట్లేదని మాత్రమే కేటీఆర్ చెప్పారు కానీ.. కేసీఆర్ విషయంపై మాత్రం ఎందుకో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కేసీఆర్ పోటీ పక్కా అనే తెలుస్తోంది.















