EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎటువంటి రికార్డులు అయినా ఇస్తానని, తప్పు చేసి ఉంటే నన్ను ఉరివేయండి డిప్యూటీ సీఎం శివకుమార్‌ సవాల్‌

 

బెంగళూరు, నవంబర్ 18 (ఈతరం ఇండియా న్యూస్) మాజీ సీఎం కుమారస్వామికి ఎటువంటి రికార్డులు అయినా ఇస్తానని, తప్పు చేసి ఉంటే నన్ను ఉరివేయాలని, అందుకు వెనుకాడేది లేదని డీసీఎం శివకుమార్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం బెంగళూరులో డీసీఎం మీడియాతో మాట్లాడుతూ.. కుమారస్వామి ఎటువంటి రికార్డులు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమన్నారు. లులు మాల్‌కు చెందిన భూమితో పాటు కరెంటు బిల్లులపై కుమారస్వామి ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతానన్నారు. లులు మాల్‌ స్థలం కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందినదన్నారు. వారు టెండర్‌ వేయగా నా మిత్రులు కొందరు దక్కించుకోగా వారి నుంచి నేను కొనుగోలు చేశానన్నారు. కుమారస్వామికు ఇంకా తెలియదని ఆయన తండ్రి దేవేగౌడ పదేళ్ళ కిందటనే సదరు భూమికి సంబంధించి తనిఖీ జరిపించారన్నారు. అన్నింటికీ నేను సిత్థమని కానీ బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదన్నారు. వారికి ఎటువంటి రికార్డులు కావాలన్నా ఇస్తానన్నారు. లులు మాల్‌ కట్టింది నేను కాదని శోభా డెవలపర్స్‌ అన్నారు. వారు ఏఏ బిల్లులు చెల్లించారో చూపుతారని వారికి నేను చెబుతానన్నారు.

Related News

Select the Topic
Scroll to Top