న్యూఢిల్లీ డిసెంబర్ 12 (ఈతరం ఇండియా న్యూస్);: చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించిన వివాదాస్పద బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలకమైన మార్పులు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర కేబినెట్ మంత్రికి చోటివ్వడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత ఉండాలంటూ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి అనుగణంగా మార్పులు చేసింది.
















