EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపీ దొంగ ఓట్లపై విచారణ నుంచి తప్పుకున్నజస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. దీంతో సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top