EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుంది : కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

న్యూయార్క్ నవంబర్ 17 (ఈతరం ఇండియా న్యూస్ );: ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్వదేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలపై ఓ కన్నేసి ఉంచారు. సదస్సు విరామ సమయంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీజేపీ అంచనాలను ఆయన పంచుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో బీజేపీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో అన్ని పార్టీల కంటే బీజేపీ ముందు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మిజోరం విషయంలో స్పష్టతలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందని పేర్కొన్నారు. కాగా.. ఒపీనియన్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను ఆయన తప్పుబట్టారు. రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్న ఒపీనియన్ పోల్స్‌‌ను ఆయన కొట్టిపారేశారు. ఈ అంచనాలు క్షేత్రస్థాయికి తగ్గట్టులేవని అభిప్రాయపడ్డారు.

Related News

Select the Topic
Scroll to Top