EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కృష్ణా బోర్డుకే ప్రాజెక్టుల నిర్వాహణ …         ఒప్పుకున్న తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఈ బీ న్యూ స్);: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వాహణను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. గురువారం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగింతపై జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నెల 17న ఢిల్లీలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అంగీకరించాయి. అలాగే నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది.

మాకు అభ్యంతరం లేదు: ఏపీ ఈఎన్‌సీ

బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటిస్‌లలో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుందని.. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయమని తెలిపారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారన్నారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి 2 టీఎంసీ, మార్చ్‌లో రైట్ మెన్ కెనాల్ నుంచి 3 టీఎంసీ ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్‌లో 5 టీఎంసీలు ఏపీకి ముందుగానే ఉన్నాయన్నారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ కోసం తెలంగాణ ఒప్పుకుందని తెలిపారు.

పూర్తిగా అప్పగించలేదు..

కేవలం తెలంగాణ ఈఎన్‌సీప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి ఇవ్వడం జరిగిందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ అన్నారు. పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయన్నారు. తమ డిమాండ్స్ అన్నీ కేంద్రానికి లేఖలు రాసామని.. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదన్నారు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని భట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేఆర్‌ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్తాయన్నారు. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని… ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుందని తెలిపారు. సీఆర్‌పీఎఫ్ కూడా కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయన్నారు. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40 : 45 కావాలని అడుగుతున్నారని వెల్లడించారు.

 

Related News

Select the Topic
Scroll to Top