ఈతరం భారతం న్యూఢిల్లీ జులై 25
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా న్యూఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. విద్యార్థుల నిరసనలకు తీవ్ర నిరసన జ్వాలలు తోడవడంతో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు విద్యార్థుల సుదీర్ఘ పోరాటం ఫలించడంతో మంత్రి రాజీనామా బాట పట్టక తప్పలేదు.మరోవైపు, నీట్ పేపర్ లీకేజీకి ఇచ్చిన సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నిందితులపై తీవ్ర చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా విధానంలో కీలక సంస్కరణలు తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.














