EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ       మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్  

సంగారెడ్డి, మే 4 (ఈతరం భారతం న్యూ స్);: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశానికి చేసింది ఏమీ లేదన్నారు.అస్సలు ఆయనకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అభివృద్ధి కేవలం మోదీతోనే సాధ్యమని.. అందుకే దేశ ప్రజలు మోదీని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అని… బీఆర్‌ఎస్‌తో అస్సలు కాదన్నారు. ఏ పార్టీకి ఓటు వేసిన గెలిచేది మాత్రం మోదీనే అని తమిళ సై ధీమా వ్యక్తం చేశారు.గవర్నర్ పదవిపై మాట్లాడుతూ…‘‘చాలా మంది మీరు గవర్నర్ పదవికి ఎందుకు వదిలేశారు అడిగిన వారికి ఒక్కటే చెపుతున్న ప్రజలతో ఉండటానికి ప్రజల కోసం పని చేయడానికి, ప్రత్యక్షంగా ప్రజలతో ఉండాలని అంతేకాక తెలంగాణ ప్రజలు అందరి నన్ను సోదరిగా స్వీకరించారు. ఆ ప్రేమ కోసం గవర్నర్ పదవిని కూడా వదిలేశా’’ అని తమిళ సై సౌందర్ రాజన్ వివరించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top