Eetarambharatamnews.
ఓ వార్త చదివా.. ఇంట్రస్టింగ్‌గా అనిపించింది.
గుజరాత్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు అభిజిత్ ప్రాణాంతక థలసీమియా వ్యాధి బారినపడ్డాడు. ఇతనికి తరచుగా రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణానికే ప్రమాదం. కానీ ఇలా చేయడం కష్ట సాధ్యం. అయితే ఎముక మజ్జ(bone marrow) మార్పిడి చేస్తే.. అభిజిత్ ప్రాణాలు నిలుస్తాయి. ఈ పిల్లాడి మజ్జ వంటి లక్షణాలు ఇండ్యూస్ చేసి… ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా కావ్య అనే పాపను పుట్టించారు. ఆ పాప ఎముక మజ్జ తీసి బాలుడికి ఎక్కించారు. దానితో బాలుడికి వ్యాధి కుదిరింది.
ఈ వార్త చదివాక మెదడులో.. ‘భారత్ దట్ వాజ్ ఇండియా’ పుస్తకంలోని ఓ అంశం మెరిసింది. కావాల్సిన లక్షణాలను పిండ దశలోనే ఇంజెక్ట్ చేయడం ద్వారా కోరుకున్న బిడ్డలను పుట్టించుకునేందుకు గవర్నమెంట్ పర్మిషన్ అవసరమని చెప్పిన విషయం గుర్తొచ్చింది.
వ్యాధులను నయం చేయడానికి ఇటీవలే మెుదలైన ఈ సాంకేతిక ప్రక్రియ(stem cell technology/ genetic engineering) మరో దశాబ్దంలో ఆర్టిఫీషియల్‌గా కోరుకున్న లక్షణాలను ఇండ్యూస్ చేసే స్థాయికి చేరుకోవచ్చు. దానితో తాము కోరుకున్న లక్షణాలు గల బిడ్డలను పుట్టించుకోవడం అందరికీ అందుబాటులోకి వస్తుంది. విచక్షణ లేకుండా దానిని వాడటంతో టెక్నాలజీ మిస్ యూజ్ అవుతుందని, అది విపరిత ప్రభావాలను చూపుతుందని.. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది. దాని ప్రకారం ఎవరైనా తమ కిష్టమైన సుగుణాలున్న పిల్లలను కనడానికి ప్రభుత్వం అనుమతి పొందుతారు. అని రచయిత చెప్పుకొచ్చాడు.
భవిష్యత్‌లో ఆవిష్కృతం కానున్న ఒక టెక్నాలజీ గురించి ఊహించి అది ఎలా మెుదలవుతుంది, వ్యక్తుల మీద, సమాజంపైన.. ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. సాంకేతిక అభివృద్ధిని, సామాజిక పరిణామాలనూ జోడించి రాయడం విశేషం. అది అచ్చు గుద్దినట్టు జరుగుతుండటంతో రచయిత, ‘వాస్తవిక ఊహాశక్తి’ని అభినందించాలనిపించింది.
‘భారత్ దట్ వాజ్ ఇండియా’-A reality of future india
మరిన్ని విషయాలు తర్వాతి పోస్టులో..















