EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

చెక్‌ రిపబ్లిక్‌ లోని నాడ్ లాబెమ్ పట్టణంలో నోట్ల వర్షం

చెక్‌ రిపబ్లిక్‌ లోని నాడ్ లాబెమ్ పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. చెక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్‌ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్‌ ద్వారా మిలియన్‌ డాలర్ల సొమ్మును ప్రజలపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.కమిల్‌ ముందుగా ఓ పోటీ నిర్వహించి అందులో గెలిచిన వారికి భారీగా సొమ్మును బహుమతిగా అందించాలనుకున్నాడు. అయితే, అతడు పెట్టిన పోటీలో ఎవరూ గెలవలేకపోయారు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాడు. పోటీదారులందరికీ ఆ డబ్బును పంచాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో ఆదివారం ఆరుగంటలకు ఆ డబ్బును పంచుతానని పోటీదారులకు మెయిల్‌ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆ సమయానికి రావాల్సిందిగా ఓ ప్రదేశాన్ని మెయిల్‌ద్వారా సమాచారం ఇచ్చాడు.ఇక అనుకున్న సమయానికి నిర్దేశించిన ప్రాంతానికి ఓ కంటైనర్‌లో ఒక మిలియన్‌ డాలర్లను నింపుకొని వెళ్లాడు. హెలికాఫ్టర్‌ ద్వారా లాబెమ్ పట్టణానికి సమీపంలోని ప్రదేశంలో ఆ డబ్బును జారవిడిచాడు. అతడు జారవిడిచిన మొత్తం డబ్బు విలువ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.8 కోట్లకు పైమాటే. ఇక ఆ డబ్బుకోసం అక్కడున్న వారు పోటీపడి మీరీ దాన్ని పోగు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కమిల్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

 

 

Related News

Select the Topic
Scroll to Top