EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్ ఏప్రిల్ 16 (ఈతరం భారతం న్యూ స్);ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నారు. ఈ కాల్పుల్లో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని కల్పర్ అడవిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదరుపడడంతో.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఘటనలో బిఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ తోపాటు మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ప్రస్తుతం మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top