EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జట్టు, గడ్డం పెంచుకుని కొత్త లుక్‌లో కేటీఆర్‌

 

హై దరాబాద్ జనవరి 22 (eetaram bharatam news);బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెయిర్ స్టయిల్‌ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్‌లో దర్శనమిచ్చారు. జట్టు, గడ్డం పెంచుకుని కొత్త లుక్‌లో సూపర్‌ హీరోలా కనిపిస్తున్నారు. ఈ కొత్త లుక్‌లో ఉన్న ఫొటోను కేటీఆరే స్వయంగా ట్వీట్‌ చేశారు.అయితే, అది ఆయన ఒరిజినల్‌ ఫొటో కాదు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని కేటీఆర్‌ ఫొటోను పొడవాటి జట్టు, గడ్డంతో ఎడిట్‌ చేసి ఆయనకే పంపించాడట. ఆ ఫొటో బాగా నచ్చడంతో కేటీఆర్‌ దాన్ని తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో షేర్‌ చేశారు.‘బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్‌ చేస్తున్నా’ అనే క్యాప్షన్‌ ఇస్తూ కేటీఆర్‌ ఆ ఫొటోను షేర్‌ చేశారు. దాని కింద ‘నా జట్టు, గడ్డం నేనే ఇలా పెంచుకున్నా’ అని ఓ లైన్‌ రాశారు. దాన్ని నవ్వుతున్న ఎమోజీని ఆడ్‌ చేశారు. కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

.

 

Related News

Select the Topic
Scroll to Top