EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జయప్రద ను అరెస్టు చేయాలంటూ కోర్టు సంచలన ఆదేశాలు

రామ్ పూర్ ఫిబ్రవరి 13 (ఈ బీ న్యూ స్);: సీనియర్ నటి, పొలిటీషియన్ జయప్రద ను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు మంగళవారంనాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈనెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని సూపరింటెడెండ్ ఆఫ్ పోలీస్ ని కోర్టు ఆదేశించింది. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఏడోసారి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసినప్పటికీ సోమవారంనాడు ఆమె కోర్టుకు గైర్హాజరయినట్టు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి అమర్‌నాథ్ తివారి తెలిపారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద రెండు కేసుల్లో జయప్రద “పరారీ”లో ఉన్నారు.జయప్రద వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. చెన్నై కోర్టు గత ఏడాది ఒక పాత కేసులో జయప్రదను దోషిగా నిర్దారిస్తూ 6 నెలల జైలు, రూ.5,000 జరిమానా విధించింది. చెన్నైలోని సొంత థియేటర్‌ కార్మికులకు ఈఎస్ఐ సొమ్ము చెల్లించలేదనే ఆరోపణలను జయప్రద ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సిబ్బంది బకాయిలు చెల్లిస్తానని, కేసు కొట్టివేయాలని కోర్టును ఆమె కోరారు. అయితే, కోర్టు ఆమె చేసిన అప్పీల్‌ను తోసిపుచ్చుతూ 6 నెలల జైలు, జరిమానా విధించింది.

 

 

Related News

Select the Topic
Scroll to Top