EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జూనియర్ వైద్యురాలపై అత్యాచార చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలి  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్

జూనియర్ వైద్యురాలపై అత్యాచార చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలి

 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్

హైదరాబాద్ సెప్టెంబర్ 3 (ఈతరం భారతం);అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగ్,సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో కోల్కత్తాలోని ఆర్జీ కార్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ పై జరిగిన క్రూరమైన అత్యాచారం కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ అత్యాచారం ఎంతో బాధాకరం అలాగే ఆ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోవడం, దుండగులు రౌడీలు పెరిగిపోయి ప్రభుత్వ అండతో మహిళలపై దాడులు చేయడం సరికాదన్నారు…డాక్టర్ అని చూడకుండా అతి కిరాతకంగా హింసించి అత్యాచారం చేసిన నిందితులని వెంటనే ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు…పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపలేక పోతున్న చేతగాని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు…అలాగే నిందితులను వెంటనే కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయకపోతే ఏబీవీపీఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోలనలను చేస్తామని హెచ్చరించారు…ఈ సందర్బంగా స్థానిక కార్పొరేటర్ దీపిక గారు మాట్లాడుతూ ఈ అనర్తానికి కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని, ప్రతి ఒక్క మహిళా నారిశక్తిని ప్రదర్శిస్తూ ఇలాంటి సంఘటనల వల్ల కుంగిపోకుండా మహిళా శక్తిని ప్రదర్శించాలని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top