ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 30 2024 :
జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగానికి చెందిన మౌలాలిలోని ఇందిరా నగర్ పెయింటర్స్ సంఘం అడ్ హాక్ కమిటీని నియమించడమైంది. జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జై స్వరాజ్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు గోలుకొండ రత్నం ఆధ్వర్యంలో సోమవారం మెట్టుగూడలోని పార్టీ కార్యాలయంలో ఈ కమిటీ ఎన్నికైంది.కమిటీ ముఖ్య సలహాదారుగా మాటూరి కృష్ణ మోహన్, అధ్యక్షులుగా గూడెం బిక్షపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గంధమల్ల మోహన్ బాబు, ఉపాధ్యక్షులుగా అమ్మనబోయిన నర్సింహా, జంగా శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ముక్క రాజు, సంయుక్త కార్యదర్శులుగా జెర్రిపోతుల అశోక్, కొన్నె యల్లయ్య, టి. మోహన్, సిహెచ్ సుమన్, కోశాధికారిగా ఇందిరాల సత్యనారాయణతో పాటు పలువురు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆర్ ఎస్ జే థామస్ తదితరులు పాల్గొన్నారు.















