ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 13,2024 :జై స్వరాజ్ పార్టీ వికలాంగుల విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా వి.వి.ఎస్.ఎల్.కె.ఎం. ప్రసాద్ ను అలాగే వికలాంగులకు విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భారతిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ నియమించారు. హైదరాబాద్లోని మెట్టు గూడలో ఉన్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరివురు ప్రస్తుతం డెవలప్ మెంట్ సొసైటీ ఫర్ డెఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలుగా పని చేస్తున్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం వీరు అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు. దివ్యాంగులకు మెరుగైన జీవితం కోసం చేపట్టాల్సిన చర్యలపై అనేక వినతి పత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించారు. అలాగే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేక ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం జై స్వరాజ్ పార్టీకి ఉన్న ఆలోచన విధానం, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరిన వారిని కాసాని శ్రీనివాసరావుగౌడ్ జై స్వరాజ్ పార్టీ వికలాంగుల విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలుగా నియమించారు















