ఈతరం భారతం న్యూఢిల్లీ ప్రతినిధి 4.4.24 : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఎంసి అధినేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జల్పాయిగురి లోని టీఎస్ స్టేట్ లను ఆమె సందర్శించారు .అక్కడ ఉన్న టీఎస్ స్టేట్ కార్మికులతో కలిసి తే యాకు కోశారు. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ లలో టీ తయారు చేశారు .తర్వాత అక్కడి కార్మికులకు టీ అందించారు స్థానికంగా ఉన్న మహిళ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు















