EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ కోరిన జై స్వరాజ్ పార్టీ

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 1 .4.2024 : తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమ టెలిఫోన్ టాపింగ్ వ్యవహారంపై ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది జై స్వరాజ్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మెట్టుగూడలో ఈరోజు జరిగిన విలేకరుల సమావే సమావేశంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు గౌడ్ మాట్లాడారు.  అనైతికమని ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కొందరి టెలిఫోన్లను కొంత పరిమిత కాలం టాప్ చేయొచ్చు .అది కూడా దేశ భద్రత అంతర్గత విషయాలు లేక విద్రోహ చర్యలు అంతర్జాతీయ ఉగ్రవాదము తదితర అంశాల నేపథ్యంలో దీనిని చట్టపరంగా అనుమతిస్తారని కాసాని అన్నారు. కానీ భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తులు పార్టీలు పార్టీ అధ్యక్షులు తోపాటు సమాజంలో ఆర్థికంగా లేదా సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ బ్రాంచి అధికారులకు అప్పజెప్పి ప్రైవేటు టీం ను వారికి తోడు చేసి ఈ టెలిఫోన్ టాపింగ్ చేయటం అనేది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించాలని జై స్వరాజ్ పార్టీ కోరుతోంది .అందుకే జై స్వరాజ్ పార్టీ ఈ వ్యవహారంలో బాధ్యులైనటువంటి వ్యక్తులు బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వయిరీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరాలని డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఎస్ఐబి అధికారులు ప్రైవేట్ వ్యక్తుల్ని గవర్నమెంట్ ఆఫీసులో ఇజ్రాయిల్ నుంచి యంత్ర పరికరాన్ని తీసుకొచ్చి టాపింగ్ చేయటం అనేది చిన్న ఆఫీసర్లకు కాదు వారికి ఇది చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆనాడు పెద్దల సూచన మేరకే ఈ వ్యవహారం జరిగింది అంటే ఆనాటి బిజెపి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అదేవిధంగా ఆనాటి హోమ్ మినిస్టర్ ఆనాటి ముఖ్యమంత్రి  ఇందులో బాధ్యత వహించే అవకాశాలుంటాయి . ఈ టెలిఫోన్ టాపింగ్ వ్యవహారం వల్ల అనేక కుటుంబాలు బలై ఉంటాయి .అదే విధంగా ఇది  తీవ్రమైనటువంటి నేరము. ఎవరు స్వేచ్ఛగా ఇంకొకరితో మాట్లాడుకోలేని పరిస్థితి. ప్రకృతి సిద్ధాంతం ప్రకారము మనిషి ఇక్కడ స్వేచ్ఛగా తన అనుకున్నట్టు బతకవచ్చు. ఇతరులకి ఇబ్బంది కలిగినంత కాలం ఆ స్వేచ్ఛని ప్రజాస్వామ్య ప్రభుత్వాలే అనుభవించడం ఇంతకంటే నేరం మరొకటి ఉండదు .అందుకే నిజమైన నేరస్తులకు శిక్ష పడాల్సిందే. ఇక్కడ ఎవరైనా తప్పించుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఐ ఎంక్వయిరీ వేసి బాధ్యులను ప్రజల ముందు పెట్టి చట్టాల ప్రకారం వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని కాసాని శ్రీనివాసరావు గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దుంబాల పరశురాములుగౌడ్ ఆర్ ఎస్ జే థామస్ అదేవిధంగా పార్టీ మహిళ అధ్యక్షురాలు రశ్మిత తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top