
హైద్రాబాద్, అక్టోబర్ 22 (ఈతరం ఇండియా న్యూస్ ప్రతినిధి ) : తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఎంతో ఘనంగా జరిగాయి. ఆట, పాటలతో పట్టణాలు, పల్లెలు, నగరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. పలు చోట్ల దేవాలయాల కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి పాల్గొన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రశాంతంగా జరిగి ముగిసిందని పలు సంస్థల నిర్వాహకులు, అధికారులు తెలిపారు.















