న్యూఢిల్లీ మే 13 (ఈతరం భారతం న్యూస్ );: లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో చురుకుగా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 62.31 శాతం పోలింగ్ నమోదైంది. ఈసీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 75.66 శాతం పోలింగ్ నమోదుకాగా, జమ్మూకశ్మీర్‌లో అత్పల్పంగా 35.75 శాతం నమోదైంది.ఆంధ్రప్రదేశ్‌లో 68.04 శాతం పోలింగ్ నమోదు కాగా, తెలంగాణలో 61.16 శాతం, బీహార్‌లో 54.14, జార్ఖాండ్‌లో 63.14, మధ్యప్రదేశ్‌లో 68.01, మహారాష్ట్రలో 52.49, ఒడిశాలో 62.96, ఉత్తరప్రదేశ్‌లో 56.35 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 67.99 శాతం, ఒడిశాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62.96 శాతం పోలింగ్ నమోదైంది.















