EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పార్లమెంట్లోకి ప్రవేశించిన అగంతకులు విజిటర్స్‌ గ్యాలరీ నుంచి ఇద్దరు సభలోకి దూకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగం ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎంపీలు సభనుంచి బయటకు పరుగులు పార్లమెంట్‌ భవనంపై ఉగ్రదాడి జరిగి నేటికి 22 ఏళ్లు బయటపడిన భద్రతా వైఫల్యం:ఎంపీ రఘు రామా ఆందోళన

 

న్యూ డిల్లీ డిసెంబర్ 13 (ఈతరం ఇండియా న్యూ స్):లోక్‌సభ లో భద్రతా వైఫల్యం బయటపడింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించారు. విజిటర్స్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకులు సభలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. వారి షూ నుంచి పసుపు రంగు గ్యాస్‌ వెలువడింది. జీరో అవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఎంపీలు సభనుంచి బయటకు పరుగులు తీశారు. అనూహ్య పరిణామంతో సభను స్పీకర్‌ ఓం బిర్లా వాయిదా వేశారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నీలం, అమోల్‌ షిండేగా గుర్తించారు.  సభలోకి ఆగంతకులు ప్రవేశించడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.

కాగా, ఇటీవలే ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఈనెల 6వ తారీఖున హెచ్చరించాడు ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్‌’ (ఢిల్లీ ఖలిస్థాన్‌గా మారబోతోంది) అనే శీర్షికతో వీడియో రిలీజ్‌ చేశాడు. ఈనెల 13వ తేదీ లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామని బెదిరించాడు. 2001 పార్లమెంట్‌ దాడి దోషి అఫ్జల్‌ గురు పోస్టర్‌ను కూడా అందులో ప్రదర్శించాడు. ఈ వీడియోలో తనని చంపేందుకు భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని అన్నారు. కాగా, డిసెంబర్‌ 13వ తేదీకి పార్లమెంట్‌ భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు నిండనుంది. 2001 డిసెంబ్‌ 13వ తేదీకి ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

పన్నూన్‌ హెచ్చరికల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం ఉగ్రకుట్రలో భాగమని అధికారులు భావిస్తున్నారు. అనూహ్య పరిణామంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పార్లమెంట్‌ ఆవరణలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఆగంతకులు పార్లమెంట్‌ ఆవరణలో నక్కి ఉన్నారామో అన్న అనుమానంతో అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

కాగా పార్లమెంట్‌లో ఆగంతుకులు చోచ్చుకురావడంపై ఎంపీ రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందన్నారు. దీని వెనుక ఎవరున్నారనేది తేలుతుందని అన్నారు.

లోక్‌సభలో జరిగిన ఘటనపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు. ‘‘ఇది లోక్‌సభలో భద్రతా ఉల్లంఘన అని.. ఇక్కడికి వచ్చే వారిలో సందర్శకులు లేదా రిపోర్టర్‌లు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. ఇది పూర్తి భద్రతా వైఫల్యం అని నేను భావిస్తున్నాను. లోక్‌సభ లోపల ఏదైనా జరిగి ఉండవచ్చు’’ అంటూ డింపుల్ యాదవ్ ట్వీట్ చేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top