ఈ తరం భారతం, హైదరాబాద్ ప్రతినిధి, మే 17 2024 :సీనియర్ జర్నలిస్ట్, రచయిత, రాజకీయ నిపుణులు నేలంటి మధును తమ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమించినట్లు ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ నిర్మాణం, పటిష్టత, విస్తరణలో మధు వ్యూహాత్మక సలహా సూచనలు అందిస్తారని ఆయన తెలిపారు. విస్తృత రాజకీయ అనుభవం గల మధు వ్యూహాత్మక మార్గ నిర్దేశనం లో పార్టీని ప్రగతి బాటలో నడిపిస్తామని బోనాల చెప్పారు. ఈ సందర్భంగా నే లంటి మధు మట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పజెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని, దీన్ని తాను నిష్ఠగా కొనసాగిస్తానని చెప్పారు. ప్రజా ఏక్తా పార్టీకి అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ కి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నానన్నారు.















