EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్‌

 

బీజింగ్‌, నవంబర్‌ 16 (ఈతరం ఇండియా న్యూస్);: అద్భుత టెక్నాలజీల ఆవిష్కరణలో శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మరో మహాద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ను విజయవంతంగా వినియోగంలోకి తెచ్చింది. ఇది ఎంత వేగవంతమైందంటే.. ఒక సెకనులో 150 సినిమాలను డౌన్‌లోడ్‌ చేయవచ్చు. సెకనులో 1.2 టెరాబైట్‌ (టీబీ) డాటాను ఈ నెట్‌వర్క్‌ ద్వారా విజయవంతంగా సరఫరా చేశారు. అంటే సెకనులో 1200 గిగాబైట్‌ (జీబీ) డాటా అన్నమాట.ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇంటర్నెట్‌ టెక్నాలజీ అత్యధికంగా సెకనుకు 100 జీబీ డాటాను మాత్రమే మార్పిడి చేయగలదు. ఇటీవల అమెరికా సెకనుకు 400 జీబీ డాటాను మార్పిడి చేయగల నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో పోల్చితే చైనా నెట్‌వర్క్‌ నాలుగింతలు. ఈ నెట్‌వర్క్‌ నిర్మాణం కోసం చైనా పదేండ్లుగా పరిశోధన చేస్తున్నది. ఈ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను బీజింగ్‌, వుహాన్‌, గాంగ్‌ఝౌ మధ్య 3000 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేశారు. సింఝువా యూనివర్సిటీ, హువావే టెక్నాలజీస్‌, సెర్నెట్‌ కార్పొరేషన్‌ కలిసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక తెలిపింది.

Related News

Select the Topic
Scroll to Top