హైదరాబాద్ జనవరి 25 (EB news);ఫిబ్రవరి 3, 4 తేదీల్లో మహారాష్ట్ర “జాల్నా” జరిగే రెండు రోజుల వినియోగదారుల ప్రతినిధుల సమావేశానికి తెలంగాణా రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల ప్రతినిధులు తప్పనిసరి గా హాజరు కావాలని వినియోగదారుల జాతీయ కమిటీ ఉపాధ్యక్షురాలు మతి దొంతి శిల్పా రెడ్డి కోరారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ లో రోజు రోజుకు మారుతూ, నూతనంగా అమలు లోకి వస్తున్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, హక్కుల పరిరక్షణ లో భవిష్యత్తు కు రోడ్డు మ్యాప్, సిటిజన్ చార్టర్ విడుదల తదితర అంశాలపై జరిగే సదస్సు AICWC ప్రధాన కార్యదర్శి దేవేంద్ర తివారీ, వర్కింగ్ ప్రెసిడెంట్ విఖ్యాత్ సేనాయ్ ల అధ్వర్యంలో జరుగగా, ముఖ్య అతిథిగా CCI చైర్మన్ డా. అనంత శర్మ పాల్గొంటున్నారు. మరియు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొనే సమావేశాలను వినియోగదారుల ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని దొంతి శిల్పా రెడ్డి తెలిపారు
.















