ఉత్తర్ ప్రదేశ్ , జనవరి 24 (eetarambharatamnews)
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగినప్పుడు అదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ని ఫిరోజాబాద్ కి చెందిన ఫర్జానా అనే ముస్లిం మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ముస్లిం దంపతులు తమకు పుట్టిన బిడ్డకు రాముడి పేరు వచ్చేలా రామ్ రహీమ్ అని పేరు పెట్టారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట ముహూర్త సమయంలోనే తనకు నార్మల్ డెలివరీ కావడంతో బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు మీడియా కు తెలిపింది.















