న్యూ డిల్లీ ఫిబ్రవరి 18 (ఈ బీ న్యూస్ );బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్ లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. మలేషియాలో జరుగుతున్నఈ టోర్నీలో దేశానికి తొలి పసిడి పతకం అందించారు. ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన మొదటిసారే భారత బృందం స్వర్ణ పతకం కొల్లగొట్టడం విశేషం.ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన ఫైనల్లో 3-2తో గెలుపొందింది. 17 ఏండ్ల అన్మోల్ ఖార్బ్ సంచలన ఆటతో పొర్న్‌పిచా చోయకీవాంగ్‌ను చిత్తు చేసి భారత్‌కు చారిత్రాత్మక పతకాన్ని అందించింది.లీగ్ దశలోనే చైనా గోడను బద్ధలు కొట్టిన భారత షట్లర్లు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ ను చిత్తు చేశారు.















