EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భార‌త్‌లో కొత్త‌గా 14.1 ల‌క్ష‌ల క్యాన్స‌ర్ కేసులు న‌మోదు ఎక్కువ శాతం రొమ్ము క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు వెల్ల‌డించిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

న్యూఢిల్లీ ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూ స్);: భార‌త్‌లో 2022లో కొత్త‌గా 14.1 ల‌క్ష‌ల క్యాన్స‌ర్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ ఏడాది సుమారు 9.1 ల‌క్ష‌ల మంది ఆ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించారు. ఎక్కువ శాతం భారతీయుల్లో రొమ్ము క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. పెద‌వు, నోరు, ఊపిరితిత్తులు క్యాన్స‌ర్ కేసులు ఎక్కువ శాతం పురుషుల్లో ఉన్నాయి. నోటి క్యాన‌ర్స్ 15.6 శాతం, శ్వాస‌కోస క్యాన్స‌ర్ 8.5 శాతం కేసులు ఉన్నాయి. ఇక మ‌హిళ‌ల్లో రొమ్ము, స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి.రొమ్ము క్యాన్స‌ర్ 27 శాతం, 18 శాతం స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ కేసులు ఉన్న‌ట్లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఏజెన్సీ ఫ‌ర్ రీస‌ర్చ్ ఆన్ క్యాన్స‌ర్ సంస్థ అంచ‌నా వేసింది. ఈ సంస్థ డ‌బ్ల్యూహెచ్ క్యాన్స‌ర్ ఏజెన్సీగా ప‌నిచేస్తోంది. క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు గుర్తించిన అయిదేళ్ల త‌ర్వాత కూడా ఇండియాలో ప్రాణాల‌తో ఉన్న వారి సంఖ్య 32.6 శాతంగా ఉన్న‌ట్లు ఆ రిపోర్టులో తేల్చారు. అయిదుగురిలో ఒక‌రి క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని, 9 మంది పురుషుల్లో ఒక‌రు, 12 మంది మ‌హిళ‌ల్లో ఒక‌రు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణిస్తున్నారు.115 దేశాల‌కు చెందిన క్యాన్స‌ర్ రిపోర్టును డ‌బ్ల్యూహెచ్‌వో రిలీజ్ చేసింది. కేవ‌లం 39 శాతం దేశాలు మాత్ర‌మే క్యాన్స‌ర్ చికిత్స గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు. 2022లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెండు కోట్ల మందిలో కొత్త‌గా క్యాన్స‌ర్‌ను గుర్తించారు. 97 ల‌క్ష‌ల మంది ఆ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించారు

.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top