భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రక్షణ కోసం అసువులు బాసిన సైనికుల స్మారకర్థం దేశంలోని ప్రతి గ్రామం నుంచి మట్టీ సేకరించి, ఢిల్లీలో అమృతా వటికా నిర్మాణానికి పిలుపునివ్వగా, ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మేరా మాటీ – మేరా దేశ్ కార్యక్రమ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో బీజేపీ నాయకులు సేకరించిన మట్టిని ఢిల్లీలోని అమృత కలశంలో వేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు.కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ ఉత్సవాలకు హుస్నాబాద్ నుంచి బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల అధ్యక్షుడు గోళ్లపల్లి వీరాచారి గార్లు పాల్గొన్నారు.
















