4.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ.
రాజ్యసభ సభ్యులుగా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర ప్రమాణస్వీకారం చేశారు.పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన తో ఉప రాష్ట్రపతి,రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ధనఖర్,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు పలువురు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.















