EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాష్ట్ర, జాతీయ విధాన సభల్లో వినియోగదారుల ప్రతినిధులకు ప్రాతినిధ్యం              అన్ని ప్రభుత్వ కాలేజీలలో స్టాండర్డ్స్ క్లబ్స్” ఏర్పాటు చేయాలి జాల్నా తెలంగాణా రాష్ట్ర వినియోగదారుల ప్రతినిధుల సమావేశంలో తీర్మానం

ముంబై ఫిబ్రవరి 4 (ఈ బీ న్యూ స్);మహారాష్ట్ర జాల్నా లోని అంబేద్కర్ భవన్ లో కన్జ్యూమర్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియా (CCI) మరియు ఆల్ ఇండియా కన్జ్యూమర్ వెల్ఫేర్ కౌన్సిల్ (AICWC) సంయుక్తంగా వినియోగదారుల ప్రతినిధుల జాతీయ సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాల వినియోగదారుల ప్రతినిధులు పాల్గొన్న నేటి సమావేశంలో CCI ఛైర్మన్ డా. అనంత శర్మ “వినియోగదారుల హక్కుల సిటిజన్ చార్టర్” ను విడుదల చేసారు. AICWC జాతీయ ప్రధాన కార్యదర్శి దేవేంద్ర తివారీ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ విధాన సభల్లో వినియోగదారుల ప్రతినిధుల ప్రాతినిధ్యం తప్పనిసరి అని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రం నుండి హాజరైన CCI జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, CATCO ఛైర్మన్ శంకర్ లాల్ చౌరాసియా, CCI తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్ లు జాతీయ నాయకులతో సమావేశమై, తెలంగాణా రాష్ట్రంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలో గత (9) సంవత్సరాలుగా ధరలు నియంత్రణ కమిటీలు లేక పోవడం, నామ మాత్రంగా ఆహార భద్రతా కమీషన్, విద్యుత్ రంగంలో మోనోపలీ వ్యాపార విధానాలు, అనుమతి లేని కాస్మోటిక్ క్లినిక్ ల అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా నేటి సమావేశంలో తెలంగాణా రాష్ట్రం నుండి వినియోగదారుల ప్రతినిధులు అన్నాప్రగడ శివపార్వతి, దొంతి శిల్పారెడ్డి, న్యాయవాది కల్యాణ్ జ్యోతి, యస్. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం CCI అధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణా లో అన్ని ప్రభుత్వ కాలేజీలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆద్వర్యంలో ” స్టాండర్డ్స్ క్లబ్స్” ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

 

Related News

Select the Topic
Scroll to Top