EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

లేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

అమరావతి, జనవరి 16 (eetaram bharatam news) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తి విమానాశ్రాయంలో మోదీకి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి లేపాక్షి ఆలయానికి పీఎం చేరుకున్నారు. మోదీకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లేపాక్షిలో వీరభద్రస్వామి, దుర్గా దేవిలకు ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయం విశిష్టతను లేపాక్షి శిల్పకళా సంపదను ప్రధానికి ఆలయ అధికారులు వివరించారు. శ్రీరామ భజనతో పాటు సంగీత కచేరిని మోదీ వీక్షించారు. శిల్ప కళా సంపదను లేపాక్షి స్థల పురాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు. లేపాక్షి ఆలయం ప్రాంగణం చుట్టూ శిల్పకళా సంపదను ప్రధాని వీక్షించారు. అలాగే ఆలయంలో ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను మోదీ వీక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top