EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

లోయలో పడి నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి

లోయలో పడి నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి

 

సిక్కిం సెప్టెంబర్ 5 (ఈతరం భారతం);సిక్కిం లో రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం అదుపుతప్పి 700 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ సిబ్బంది పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్‌ నుంచి సిక్కింలోని పాక్యోంగ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి సుమారు 700 నుంచి 800 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా పశ్చిమ బెంగాల్‌లోని బినాగురికి చెందిన ఎన్‌రోట్‌ మిషన్‌ కమాండ్‌ విభాగానికి చెందిన వారుగా భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top