EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వరుస భూకంపాలతో వణికిపోతోన్నఐస్‌లాండ్‌ ద్వీపం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు కంపించిన భూమి

 

ఐస్‌లాండ్‌ నవంబర్ 11 (ఈతరం ఇండియా న్యూస్);ద్వీప దేశం ఐస్‌లాండ్‌ వరుస భూకంపాలతో వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది రెక్జానెస్‌ ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.శుక్రవారం ఐస్‌లాండ్‌ రాజధాని రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.2 తీవ్రతగా నమోదైనట్లు ఐస్‌లాండ్‌ వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు ఈ ప్రకంపనలతో సమీపంలోని రహదారులు ధ్వంసమవడంతో.. రాకపోకలను అధికారులు మూసివేశారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకూ దాదాపుగా 800 సార్లు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.వరుస భూకంపాలతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయోచ్చని ఐస్‌లాండ్‌ వాతావరణ విభాగం హెచ్చరించింది. భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతంలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్‌ ప్రాంతంలో ఏకంగా 24 వేల ప్రకంపనలు సంభవించాయి.

Related News

Select the Topic
Scroll to Top