EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు పై రవాణా శాఖ గైడ్‌లైన్స్        మరో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు

హైదరాబాద్ ఫిబ్రవరి 5 (ఈ బీ న్యూస్ ): వాహనాల కూడా సిద్ధం చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వానదారులపై భారం పడకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆదివారం జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణ రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో నంబర్ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కొత్తగా 10 వేల నూతన వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాల నంబర్ ప్లేట్లపై మాత్రమే టీజీగా మార్చే యోచనలో అధికారులు ఉన్నారు. దీంతో ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న నెంబర్ ప్లేట్లు కొనసాగనున్నాయి. అలాగే విభజన అనంతరం ఇంకా ఏపీ నెంబర్ ప్లేట్లతోనే 30 లక్షల వాహనాలు కొనసాగుతున్నాయి.

 

Related News

Select the Topic
Scroll to Top