16.2.2024ఖమ్మం బ్యూరో నలుబోల మధుశ్రీ (ఈ బీ న్యూస్)భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు.
మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఈ ప్రయోగాన్ని డిజైన్ చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలుతెలిపారు. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని వివరించారు.















