EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శునక జాతులపై నిషేధం ఉత్తర్వులను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, ఏప్రిల్ 10 ఏప్రిల్ 10 (ఈతరం భారతం న్యూ స్);: కొన్ని శునక జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టేసింది. శునక జాతులపై నిషేధం విధించే ముందు సదరు శునకాల ఓనర్లతోపాటు అందుకు సంబంధించిన సంస్థల నిర్వాహకులను సంప్రదించి.. ఆ తర్వాత ఈ నిషేధం విధించారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పెంపుడు జంతువులు ఎవరినైనా గాయపరిచినా.. అందుకు బాధ్యత వహించాల్సింది వాటి యజమానులేనని.. వారికి నగదు చెల్లించాల్సి ఉందని ఈ సందర్బంగా హైకోర్టు స్పష్టం చేసింది.అయితే దేశవ్యాప్తంగా ఇటీవల శునకాల దాడుల చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పశు సంవర్థక మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ తరహా శునకాలను పెంచడం కానీ. విక్రయించడం కానీ చేయరాదని సదరు నిపుణుల కమిటీ అభిప్రాయ పడుతూ.. ఆ మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేసింది. దీంతో 23 శునక జాతులపై కేంద్రం నిషేధం విధించింది. అందుకు మార్చి 13వ తేదీన రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సర్క్యూలర్ జారీ చేసింది. ఆ సర్క్యూలర్‌లో నిషేధం విధించిన పలు శునకాల జాతుల పేర్లను పొందు పరిచింది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top