స్ట్రోక్ రావడానికి కారణాలు.
అధికరక్తపోటు స్ట్రోక్ కు ప్రధాన కారణం అవుతుంది. అధికరక్తపోటు కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడతాయి. మెదడు గుండె నాళాలమీద ప్రభావం చూపుతుంది. దీనికారణంగా మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తసరఫరాలో అడ్డంకి ఏర్పడటం జరుగుతుంది. అలాగే గుండె కొట్టుకునే తీరు సరిగా లేకున్నా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడుకు వెళ్ళే రక్తనాళాల అడ్డంకికి దారి తీస్తుంది.అధికబరువు ఉన్నవారు కూడా స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. శారీరక శ్రమ లేని జీవనశైలి అధికబరువుకు తద్వారా స్ట్రోక్ కు దారితీస్తుంది. వారంలో 4-5 రోజులు, రోజూ నిమిషాల శారీరక శ్రమతో పాటు సాధారణ 30-40 వ్యాయామాలు చెయ్యాలి. మధుమేహం అదుపులో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం, పరిసరాలు అధిక కాలుష్యం కూడా స్ట్రోక్ కు కారణమవుతాయి.
స్ట్రోక్ రాకూడదంటే..
తక్కువ ఉప్పు కలిగిన ఆహారం తీసుకోవాలి, ఫాస్ట్ ఫుడ్స్, బేకింగ్ ఫుడ్స్ మానేయాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఫాలోఅవ్వాలి.
















