మనమెందుకు అలవాట్లు మార్చు కుంటున్నాం
జీవుల కొసం ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారాన్ని అందిస్తూ ఉంది. పశపక్ష్యాదులు దాన్ని యధాతధంగా స్వీకరిస్తున్నా మనుషులు మాత్రం రక రకాలుగా వండి, మార్చి ఆరగిస్తున్నారు. జంతు జాలానికి ఈ అవకాశం లేదు. వేల సంవత్సరాలుగా అవి తమ ఆహారపు అలవాట్లు మార్చు కాకుండా కొన సాగిస్తున్నాయి. అందుకే అవి తమంతట తాముగా అనారోగ్యాన్ని సృష్టించుకోవు. సహజ వాతావరణానికి దూరమైన మనిషి తన యాంత్రిక జీవన విధానం గురించి ఆలోచించాల్సి ఉంది. కాలానుగుణంగా మారుతున్నామని కొందరు సూత్రీక రిస్తుంటారు కానీ ఇందులో వాస్తవం లేదు. కాలం ఎలా మారుతుంది ? సమయానుసారంగా ఋతువులు ఏర్పడటం లేదా? సూర్య చంద్రాది గ్రహ నక్షత్రాలు తమ డ్యూటీ లను మార్చుకున్నా యా? ప్రకృతిలో కొత్తగా ఎలాంటి మార్పు రాలేదే?
మార్పు మనం చేశాం. ప్రకృతి ఇచ్చిన ఫలాలను మార్కెట్ చేశాం. పోటీ పడి పర్యావరణాన్ని ధ్వంసం చేశాం. నడిచే ప్రపంచం వెనుక ఏదో ఉందని దానికి ఒక పేరు ఇచ్చి కష్టాలు నాష్టాలనీ అతనిపై భారం మోపుతున్నం. ఎవ్వరూ చూడరని మనస్సును రక రకాలుగా పరుగెట్టిస్తున్నం. కొన్ని అభిప్రాయాలు సిద్ధాంతాలు గా తత్త్వాలు గా విశ్వాసాలు గా మతాలు గా స్థిరం చేసుకుని వాటి పైనే పరిశీలనలు పరిశోధనలు చేస్తున్నాం. కానీ ఇది ప్రా పంచిక విషయాలపై సరి అయిన అవగాహన పెంపొందించే మార్గం చూపించడం లేదు పైగా గందగోళానికి సృష్టిస్తోంది…







