ఈ తరం భారతం కరీంనగర్ ఏప్రిల్ 13 :కరీంనగర్ కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు లింగాల రజని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. సౌతెర్న్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఈ అవార్డును ఆమెకు అందజేసి సత్కరించింది . కార్యక్రమ అతిధులైన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు మహమ్మద్ నశీర్ అహ్మద్, గల్లా మాధవి,తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎస్ పి ఎల్ టి ఓ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ పి నాగయ్య, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె మోసెస్ , పి రాణి శ్రీ అమృత వర్షిని తదితర ప్రముఖులు అవార్డు అందుకున్నందుకు అభినందనలు చెప్పారు. అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న రజనికి పలువురు ఉపాధ్యాయులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు .
